Fri Dec 20 2024 14:49:34 GMT+0000 (Coordinated Universal Time)
Kalvakuntla Kavitha : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యారు. తీహార్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురికావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీహార్ జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి కవితను తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలులో ఉన్నారు.
నాలుగు నెలల నుంచి...
ఈ ఏడాది మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు నాలుగు నెలల నుంచి తీహార్ జైలులోనే కవిత ఉన్నారు. ఆమె బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే తాజాగా కవిత అస్వస్థతకు గురికావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.
Next Story